TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై చిరుత దర్శనమిచ్చింది. రోడ్డు దాటుతుండగా చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడిన చిరుత చాలా సేపు రోడ్డుపైనే పడిపోయింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు చిరుతను చూసిన భయపడ్డారు. అయితే కొద్దిసేపు తర్వాత చిరుత లేచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.