ప్రొద్దుటూరులోని స్థానిక శ్రీకృష్ణ దేవాలయం నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని వితరణ చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి వారి గ్రామోత్సవాన్ని పట్టణంలోని పురవీధుల్లో వైభవంగా ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు.