ప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా లైసెన్స్ ను కలిగి ఉండాలి

951చూసినవారు
ప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా లైసెన్స్ ను కలిగి ఉండాలి
బద్వేల్ పట్టణంలో షాపులు నిర్వహించు ప్రతి యజమాని తప్పనిసరిగా లైసెన్స్ రిజిస్టర్డ్ బిల్ బుక్ కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు పి ఓబులేసు తెలిపారు. పట్టణంలోని కన్జ్యూమర్ ఫోరం ఆఫీస్ లో
శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బద్వేల్ పట్టణంలో బట్టల షాపులు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్స్, చెప్పుల షాపులు నడుపుతున్న వ్యాపార యజమానులు తప్పనిసరిగా వ్యాపారానికి సంబంధించిన లేబర్ సర్టిఫికెట్ షాపు రిజిస్ట్రేషన్ జీఎస్టీ నెంబర్ కలిగి ఉండాలని వారు తెలిపారు. ఏ దుకాణదారుడైన ప్రభుత్వపు నియమ నిబంధనలు ఉల్లంఘించి సొంత నిర్ణయాలతో షాపులు నడిపుచున్నచో ఆ షాపుకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ సి ఆర్ పి ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ రవిబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి ప్రభాకర్, బద్వేల్ డివిజన్ ప్రెసిడెంట్ జి రవిచంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్