ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పోరుమామిళ్లలో సోమవారం వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీలో నూతనంగా పదవులు పొందిన వారు గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని తెలిపారు. కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.