మాప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగాఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఎఐటియుసి బద్వేల్ పట్టణ కార్యదర్శి ఇర్ల నాగేష్ డిమాండ్ డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 40 వేలకు పైగా కాంటాక్ట్- ఔట్సోర్సింగ్ కార్మికులుగా (ఆప్కాస్) మరియు 10 వేలకు పైగా సిపిఎస్ ఉద్యోగులు, 2 వేల మంది క్లాప్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారందరూ పట్టణాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ, మంచినీటి నిర్వహణ, వీధిలైట్లు, పార్కులు, భూగర్భ డ్రైనేజీల నిర్వహణ, టౌన్ ప్లానింగ్, ఆఫీసు నిర్వహణ, తదితర సేవల ద్వారా రాష్ట్రంలోని 40 శాతం జనాభాకు వెలకట్టలేని సేవలందిస్తున్నామని, ప్రభుత్వాలు , పాలకులు మారుతున్నారు తప్ప మా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కు పెద్ద తేడా లేదు, మీరు వారిని నమ్మించి మోసం చేశారు.మీరు వాళ్ళని పర్మినెంట్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక పర్మినెంట్ చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారని, పాదయాత్రలో ఆరు నెలల్లో మన ప్రభుత్వం రాగానే కాంట్రాక్టు -అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు భిన్నంగా కాంట్రాక్ట్- ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఆప్కాస్) పరిధిలో చేర్చి రోజు వారి సమస్యలను పట్టనట్లుగా వ్యవహరించడం దారుణం అన్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో ఒప్పందం సందర్భంగా 10, 117 మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రకటించారని, ఇవన్నీ ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు దేవా హరి శ్రీనివాసరాజు వెంకటరెడ్డి ఆదినారాయణ ప్రతాప్ శ్రీనివాసులు తదితర కార్మికులుపాల్గొన్నారు.