చిట్వేలు: కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోండి
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, నూతన గృహాల మంజూరు కొరకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చిట్వేలి మండల రెవెన్యూ అధికారి మోహన్ కృష్ణ తెలిపారు. శుక్రవారం చిట్వేలు ఎమ్మార్వో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు వారి సచివాలయంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు, నూతన గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.