మౌలిక వసతుల కల్పనకే మా ప్రాధాన్యత
చిట్వేలి మండలంలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ అన్నారు. బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు, సిసి రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు. సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారం కొరకు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.