దౌర్జన్యానికే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. గురువారం జమ్మలమడుగు వైస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు నాయకుల ఆదాయం కోసం నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారని, పోలీసు, రెవెన్యూ అధికారులు అధికార యంత్రాంగానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. ఫ్లైయాష్ తరలింపులో ఇద్దరు నాయకులు తమ ఆదాయం కోసం శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.