కడప జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో బాధ్యతలు నిర్వహించి కొండాపురం తహశీల్దారుగా పనిచేస్తున్న సి. గురప్పను తన కార్యాలయంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మంగళవారం సన్మానించారు. ప్రజలకు గురప్ప మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మనోహర్ బాబు, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సుబ్బారావు, ప్రభుదాసు, తదితరులు పాల్గొన్నారు.