ముద్దనూరు మండలము కే. తిమ్మాపురం, వేల్పుచర్ల గ్రామాల్లో శుక్రవారం పశు వైద్యాధికారులు గొర్రెలు, మేకలలో సామూహిక నట్టల నివారణ కార్యక్రమము నిర్వహించారు. డాక్టర్ వాసా శ్రీనివాస, డాక్టర్ హిమ బిందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిమ్మాపురంలో 2550 గొర్రెలకు, 270 మేకలకు మరియు వేల్పుచర్లలో 1860 గొర్రెలకు, 650 మేకలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సామూహిక నట్టల నివారణ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు జరగనుంది.