ముద్దనూరు: వర్షానికి కూలిన ఇంటి పైకప్పు

79చూసినవారు
ముద్దనూరు: వర్షానికి కూలిన ఇంటి పైకప్పు
ముద్దనూరు మండల పరిధిలోని చిన్నకత్తేరపల్లె గ్రామంలో వర్షాల కారణంగా గురువారం రాత్రి బట్టు రమణయ్య ఇంటి శ్లాబ్ కూలింది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో ఆయన ఇల్లు బాగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేనందున ఏమీ జరగలేదు కానీ అస్తి నష్టం కలిగింది. అలాగే గంగాదేవిపల్లెకు చెందిన జగదీశ్వర్ రెడ్డి ఇంటి గోడల్లోకి వర్షపు నీరుదిగి గోడ కూలింది.

సంబంధిత పోస్ట్