జమ్మలమడుగులో వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. మృతుడు మేసా వసంతకుమార్ (30) గుర్తించారు. రాళ్ళగుళ్ళకుంట రోడ్డు పక్కన పంటపొలం మృతదేహం లభ్యమైంది. పట్టణంలో ఎస్ పిజి కోటర్స్ నివాసం ఉంటున్నట్లు తెలిపారు. మృతుడు కడప ఆర్ట్స్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని అర్బన్ సీఐ లింగప్ప దర్యాప్తు చేస్తున్నారు.