ఈనెల 27న గండికోటలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులోని గండికోటలో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక పొందిన పర్యాటక ప్రాంతమైన గండికోట పర్యాటక కేంద్రంలో వైభవంగా పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.