పార్వతీ దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి
జమ్మలమడుగు పట్టణ పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభించినట్లు ఆర్యవైశ్య ప్రతినిధులు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పార్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు చెప్పారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాలు అందించారు.