కొప్పర్తిలో పలు సేవా కార్యక్రమాలు

1029చూసినవారు
కొప్పర్తిలో పలు సేవా కార్యక్రమాలు
యోగి వేమన విశ్వవిద్వాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ -5 ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య కె. అనిత ఆధ్వర్యంలో పెండ్లిమర్రి మండలం కొప్పర్తిలో వారం రోజులు సేవా కార్యక్రమాలతో శిబిరాన్ని ఆదివారం ముగించారు. చివరి రోజున స్థానిక పాఠశాలలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పోషకాహార లోపం, సమతుల్య ఆహారం గురించి ఆచార్య అనిత అవగాహన కల్పించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వాలపరంగా లభిస్తున్న సహకారం గురించి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్