యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీ కృష్ణారెడ్డిని తొలగించాలని, ఈనెల 23వ తేదీ శుక్రవారం వైవియూ ముట్టడి చేపడుతున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. వలరాజు తెలిపారు. కడపలో పలు డిగ్రీ కళాశాలలలో కరపత్రాలు పంపిణీ చేసి ముట్టడికి రావాలని గురువారం విద్యార్థులను కోరారు. ఇదే వీసీ మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.