కమలాపురంలోని యోగి వేమన విశ్వవిద్యాలయం అధ్యాపకులు నలుగురిని ఉత్తమ గురువులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆచార్య ఎం. అనిత( ఎకనామిక్స్), ఆచార్య విజయభారతి (కామర్స్), ఆచార్య ఎల్ వీరాంజనేయరెడ్డి (మైక్రోబయాలజీ), అకాడమిక్ కన్సల్టెంట్ ఎస్. ఖాజాపీర్ (ఉర్దూ) ఈ జాబితాలో ఉన్నారు. ఈనెల 11వ తేదీన "జాతీయ విద్యా దినోత్సవం" సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో వీరిని ఘనంగా సత్కరించనుంది.