బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకులగుంట గ్రామ పంచాయతీ పరిధిలో గల బాగాధిపల్లె, చీకటివారిపల్లెకు వెళ్లేందుకు నూతనంగా రూ.12లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డ నిర్మాణానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం భూమిపూజ చేసి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రోడ్డు పనులను ప్రారంభించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.