ప్రభుత్వం నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు, గొర్రెల పెంపకం దారులు వినియోగించుకోవాలని మైదుకూరు మండలంలోని వనిపెంట పశువైధ్యాదికారి డాక్టర్. ఆర్. సుధాకర్ అన్నారు. మంగళవారం ముదిరెడ్డిపల్లె తాండా గ్రామంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు నట్టల నివారణ మందులు తప్పక వేయించాలని తెలిపారు. అనంతరం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును తాగించి.. ఆవులకు, దూడలకు, గేదెలకు వైద్యం అందించారు.