మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లె సమీపంలో గల కొండపై వెలసిన ముక్కంటి మల్లేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం ఉదయం నుంచి భక్తులు కార్తీక పూజలు నిర్వహిస్తున్నారు. రెండు కిలో మీటర్ల మేర మెట్ల మార్గంలో భక్తులు కొండపైకి వెళ్లి ముక్కంటి మల్లేశ్వర స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.