కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లే సచివాలయ పరిధిలోని పాపిరెడ్డి పల్లి ప్రాథమికోన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి ఉచితంగా వైద్య నిపుణులతో వైద్య సేవలు అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని మైదుకూరు ఎమ్మెల్యే పేర్కొన్నారు.