ఏఐవైఎఫ్ మండల కమిటీ ఎన్నిక
అఖిల భారత యువజన సమాఖ్య బ్రహ్మంగారిమఠం మండలం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకులు పెద్దులపల్లి ప్రభాకర్ తెలిపారు. ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా పెద్దులపల్లె మల్లేష్, నాగిపోగు లోకేష్ ఎన్నికయ్యారు. వీరితో పాటు 9 మంది మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ కమిటీ పని చేస్తుందని.. ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లా మహభలు బద్వేలులో నిర్వహించనున్నట్లు తెలిపారు.