రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది: మంత్రి సీతక్క

77చూసినవారు
రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది: మంత్రి సీతక్క
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం అన్నారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రామప్ప కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పేలా అభివృద్ధి పనులను చేపట్టాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్