ప్రొద్దుటూరు నియోజవర్గంలోని నంగనూర్పల్లిలో మంళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ ఏఎస్ఐ భైరగాని మునయ్య ఇంట్లో దొంగలు సుమారు 25 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనాన్ని గుర్తించకుండా సనీ పక్కీలో వారు ఇల్లంతా కారంపొడి చల్లి, తమ ముద్రలను కనపడకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.