కళాకారులను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమంలో శ్రీ నటరాజ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శనివారం రాయలసీమ సంగీత నృత్యోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మన సాంప్రదాయ కళలను కాపాడుకోవాలన్నారు. నటరాజ కళాక్షేత్రం నాట్య గురువు మొహద్దిన్ ఖాన్ మాట్లాడుతూ 3 రోజులపాటు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను విద్యార్థులు ప్రదర్శిస్తారని తెలిపారు.