పులివెందుల - కడప ప్రధాన రహదారిలో ఢిల్లీకి చెందిన అరటికాయల లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ స్తంభం కడప ప్రధాన రహదారిలో అడ్డంగా విరిగి పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రమాదం తప్పినప్పటికీ కడపకు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన తెలుసుకున్న విద్యుత్ అధికారులు పోలీసులు అక్కడికి చేరుకొని విద్యుత్ స్తంభాలను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు.