కువైట్ లో వేంపల్లి వాసి మృతి

58చూసినవారు
కువైట్ లో వేంపల్లి వాసి మృతి
వేంపల్లె వాసి కువైట్ దేశంలో గుండె పోటుతో మృత్యువాత పడ్డాడు. మృతున్ని బంధువులు వివరాల మేరకు శగనలా శివ కుమార్ స్థానిక శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండేవాడు. కుటుంబాన్ని పోషించుకొనేందుకు 8 సంవత్సరాల క్రితం కువైట్  వెళ్లి అక్కడ డ్రైవర్ గా పని చేసేవాడు. న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం శివ కుమార్  భార్య సుభాషిణితో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత గుండె పోటుతో మృతి చెందాడని కువైట్ నుండి సమాచారం వచ్చినట్లు బంధువులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్