కడప జిల్లా లింగాల మండల పరిధిలోని దొండ్ల వాగు గ్రామ పరిసరాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జోరుగా కోడిపందాలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దొడ్ల వాగు సమీపంలో బారికేడ్లు, పందాల నిర్వహణకు కోర్టు ఏర్పాటు చేసి కోడి పందేలను జోరుగా జరుపుతున్నారు. ఈ పందాలు చూడడానికి జిల్లాలో నలుమూలల నుంచి జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.