లింగాల మండలంలోని వెలిదండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కెవి వెలిదండ్ల ఫీడర్ పరిధిలోని శుక్రవారం ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వెల్లిదండ్ల సబ్ స్టేషన్ పరిధిలోని 11కె. వి కర్ణపాపాయపల్లె ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని ఏఈ బాల సంజీవులు తెలిపారు.