పులివెందుల టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీటెక్ రవి పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ బాధిత నిరుపేద కుటుంబాలకు సంజీవని అని కొనియాడారు. అదే విధంగా చెక్కుల జారీలో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబీకులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.