పులివెందుల: 'రేషన్ బియ్యం పంపిణీలో సమస్యలుంటే పరిష్కరిస్తాం'

83చూసినవారు
రేషన్ బియ్యం పంపిణీలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని జేసీ అదితి సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని రేషన్ బియ్యం గోడౌన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ అదితి సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేశామన్నారు. రేషన్ పంపిణీలో సమస్యలు ఏమైనా ఉంటే రెవెన్యూ సిబ్బందికి తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్