ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్దయ్య పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామంలో డ్రై డే సందర్భంగా ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వేలు నిర్వహించారు. అనంతరం నీటి నిల్వలు ఉన్న చోట ఆబైట్ మందు పిచికారి చేయించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.