ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రజలు కాలర్ పట్టుకుని ప్రశ్నించాలని నారా లోకేశ్ మంత్రిగా తన పోలీస్ భద్రతను పక్కకు పెట్టి ప్రజల్లోకి రాగలరా అని సవాల్ చేశారు.