వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీఐ చాంద్ బాషా తెలిపారు. పులివెందుల పట్టణంలో శనివారం అర్బన్ సీఐ చాంద్ భాష తమ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పూలంగళ్ళ సర్కిల్ వద్ద నుండి పాత ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డుకు అడ్డంగా వాహనాలను పార్కింగ్ చేసిన వాహనదారులకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.