ఆధునిక సాంకేతికతను తెలిపే జాతీయ సదస్సుల్లో విద్యార్థులు పాల్గొని నైపుణ్యతను పెంపొందించుకోవాలని జేఎన్టీయూ ప్రిన్సిపల్ అరుణ కాంతి అన్నారు. శుక్రవారం పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో యంత్ర 2024 జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంకే ఇండస్ట్రీస్ టెక్నికల్ ట్రైనర్ రాహుల్ రంజన్ ఎఫ్3 కారు డిజైన్, దాని పనితీరు గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులుపాల్గొన్నారు.