సింహాద్రిపురం: రైతు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

75చూసినవారు
సింహాద్రిపురం మండలం నంద్యాలం పల్లెలో వెంకట మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై కొందరు రాడ్లతో దాడి చేశారు. శుక్రవారం పొలానికి వెళ్తున్న సమయంలో కాపు కాచి ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపాడు. దాడిలో
గాయపడిన మహేశ్వర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సింహాద్రిపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్