సింహాద్రిపురం: "గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలి"

72చూసినవారు
సింహాద్రిపురం: "గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలి"
గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో కృష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన సింహాద్రిపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అరుణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్