వేంపల్లి: మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వం

81చూసినవారు
వేంపల్లి: మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వం
విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ఒకేసారి ప్రజలపై రూ. 6073 కోట్లు అదనపు భారాన్ని మోపిందన్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు భారాన్ని మోయాలన్నారు.

సంబంధిత పోస్ట్