వేముల: ప్రకృతి వ్యవసాయంపై కూరగాయల సాగు

74చూసినవారు
వేముల: ప్రకృతి వ్యవసాయంపై కూరగాయల సాగు
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు కూరగాయల సాగు చేయడం ఉత్తమమని ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ ఛార్జ్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన వేములలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులైన ఏటీఎం మోడల్ పద్ధతిలో సాగు చేసిన కూరగాయల పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు సాగు చేయడం వల్ల ప్రజలకు పౌష్టికాహారం అందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్