పులివెందులలోని పలు కాలనీలో నీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పులివెందుల ప్రాంతానికి తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పైపులైన్ మరమ్మతు పనులు చేపడుతుండడంతో నీటి సమస్యలు తలెత్తాయి. ఆదివారం ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి నీటి కష్టాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.