ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలి.. కానీ విద్యార్థి సంఘాలు నిరసనలు, ధర్నాలతో పరిపాలన పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రూల్స్ అతిక్రమణ, నినాదాలు, అధికారులపై అనుచిత భాష, విధులకు అడ్డంకిని నిషేధించారు. అనుమతి లేకుండా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.