ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ మహిళా నేత స్వీటీ కౌశిక్ నేత కూతురు రిచా కౌశిక్ దుర్మరణం చెందారు. కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దాదాపు 5 పల్టీలు కొట్టడంతో కారు మొత్తం నుజ్జునజ్జు అయింది. ఈ ప్రమాదంలో రిచా కౌశిక్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.