ఏపీలోని రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను 50 శాతం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (SMAM) పథకం ద్వారా యంత్రాలను ప్రభుత్వం అందించనుంది. రైతులు మార్చి 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు ఇవే..
- రైతులకు 5 ఎకరాలలోపు భూమి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, మహిళలు, సన్న, చిన్న కారు రైతులకు ఇస్తారు.
- ఈ-పంట కింద భూమి నమోదు చేసుకుని ఉండాలి.
- ట్రాక్టర్ పరికరాలు కావాలంటే.. ట్రాక్టర్ ఉండాలి.