అత్తమామలను తల్లీదండ్రులుగా చూసుకోవాల్సిన కోడలు తీవ్రంగా దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రియదర్శిని, తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తన కొడుకు, కూతురుతో కలిసి మామయ్య నరసింహయ్య ఇంటికి వెళ్లింది. కోపంతో అత్తమామలను బయటికి ఈడ్చుకొచ్చింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని తిట్టింది. అయితే ఇది ఎవరో వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.