AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేత రామకృష్ణ హత్య కలకలం రేపుతోంది. తనను వైసీపీ నేతలు చంపేస్తారని రామకృష్ణ 15 రోజుల క్రితం వీడియో రూపంలో చెప్పారని, పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రామకృష్ణపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సీఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.