ఓబులవారిపల్లి మండలం మంగంపేట లో అక్రమంగా నిర్మించిన ఇంటిని ఏపీ ఎండిసీ అధికారులు బుధవారం కూల్చి వేశారు. ఏపీ ఎండిసికి చెందిన స్థలంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన కొంతమంది నివసిస్తున్నారు. ఆ స్థలం సమీపంలో ప్రభుత్వం ద్వారా పరిహారం పొందవచ్చనే ఉద్దేశంతో ప్రముఖ వైసిపి నాయకుడు ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నారు. గమనించిన ఏపీ ఎండిసి అధికారులు పోలీసులు సహాయంతో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు.