ఓబులవారి పల్లి మండలం కాకర్ల వారి పల్లిలో 7 కోట్ల 52 లక్షలు రూపాయలతో.. కిలోమీటర్ సిమెంట్ రోడ్డు, తుమ్మకొండ నుండి చిన్న ఓరంపాడుకు 9 కిలోమీటర్ల తారు రోడ్డు వేయుటకు సోమవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.