రైల్వే కోడూరు మండలం అనంత రాజుపేట ఎంపీపీ స్కూల్ నందు జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొంటారని తెలిపారు. కావున కోడూరు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.