కురబలకోట మండలంలో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్ కోసం అప్పులు చేసి తీర్చలేక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పిచ్చిలవాండ్ల పల్లెకు చెందిన రెడ్డి శేఖర్ రెడ్డి (23) ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి మోటార్ బైకును కుదువ పెట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో విషం తాగాడు. ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.