రైల్వే కోడూరులో సిద్దేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న నయారా పెట్రోల్ బంకు నందు శుక్రవారం పెట్రోల్ తో పాటుగా నీరు వస్తోందని ద్విచక్ర వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంక్ యజమానులకు తాము చెప్పిన వినకుండా నీటితో కలిసిన పెట్రోల్ అందరికీ అమ్ముతున్నారని వారు అన్నారు. నీళ్లు కలిసిన పెట్రోల్ దాదాపు 60 వాహనాలకు పట్టారని, తమ వాహనం చెడిపోయి రిపేర్ ఖర్చులకు 10 వేలు ఖర్చు అవుతున్నట్లు వారు తెలిపారు.